నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని కాస్ బాగ్ తాండలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం 20 లక్షల నిధులతో కూడిన గ్రామపంచాయతీ భవనానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాస్ బాగ్ తాండ కు గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించుటకు నిధులు కేటాయించాలని అన్నారు. ఆరు నెలల లోపే భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి తయారు చేయాలని అధికారులను సూచించారు. అలాగే మోపాల్ మండల కేంద్రంలో కురుమ సంఘ కళ్యాణ మండపం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కురుమ కులస్తులకు కళ్యాణ మండపానికి తన వంతు నిధులు కేటాయిస్తానని చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. త్వరగా భవన నిర్మాణం చేపట్టాలని తన సొంత ఎమ్మెల్యే నిధుల నుండి నిధులు కేటాయిస్తాని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కురుమ సంఘ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క సంఘ సభ్యుడు కలిసి ఉండాలని, కళ్యాణ మండప నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. సంఘ సభ్యులు అందరూ కలిసి ఇంకా కొంత చందాలు వేసుకొని, ఎక్కువ డబ్బులు జమ అయ్యేటట్టు చూసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని వాటిని కోరారు. అలాగే సారంగాపూర్ ఫ్యాక్టరీని బెల్లం ఫ్యాక్టరీగా మార్చడానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వం దీన్ని అదుకుంటుందని ఎద్దేవా చేశారు. బిజెపి బీఆర్ఎస్ కలిపి పనిచేస్తున్నాయని , టిఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల రాగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి, అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మెన్ కేశవ వేణు, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, కురుమ సంఘ అధ్యక్షు, కార్యదర్శులు సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

