నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులు రూ. 4.50 కోట్లతో నిర్మించనున్న నిజామాబాదు – వర్ని రోడ్డుకు జిల్లా ఇంఛార్జీ మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే 6కోట్ల రూపాయలతో నిజామాబాదు – నర్సి రోడ్డు కు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ ఏమ్మెల్సీ ఆకుల లలిత, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

