Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 5:25 pm Posted by : ramakrishna

నిజామాబాద్ – వర్ని రోడ్డు కు శంకుస్థాపన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ పట్టణంలోని ఎస్సీ ఎస్డీఎఫ్ నిధులు రూ. 4.50 కోట్లతో నిర్మించనున్న  నిజామాబాదు – వర్ని రోడ్డుకు జిల్లా ఇంఛార్జీ మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సోమవారం శంకుస్థాపన చేశారు.  అలాగే 6కోట్ల రూపాయలతో నిజామాబాదు – నర్సి రోడ్డు కు  శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ ఏమ్మెల్సీ ఆకుల లలిత, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Foundation laying of Nizamabad - Warni Road