24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జెడ్పి కోఆప్షన్ మాజీ సభ్యులు గుండె పోటు తో మృతి

Must read

📰 Generate e-Paper Clip

 జెడ్పి కోఆప్షన్ మాజీ సభ్యులు గుండె పోటు తో మృతి

బతుకమ్మ, మాచారెడ్డి:

ఉమ్మడి నిజామాబాద్ జెడ్పి మాజీ కోఆప్షన్ సభ్యులు, ఉద్యమకారుడు ముస్తక్ హుస్సేన్ గుండె పోటు తో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్ లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఆయన అంత్యక్రియలు ఉమ్మడి మాచారెడ్డి మండలం వెల్పగొండ గ్రామంలో మధ్యాహ్నం నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఉమ్మడి మాచారెడ్డి మండల కమిటీ అధ్యక్షులు గా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ కాలంలో అందరితో చనువుగా ఉంటూ పరిచయాలు పెంచుకున్నారు. అతని సేవలను గుర్తించి జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు గా నియమించారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యుల ను ఓదార్చుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

More articles

Latest article