25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఇందల్వాయి : ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో  టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుర్షిత్ భార్య అనారోగ్యంతోమృతి చెందడంతో సోమవారం రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యకర్తలు ఎవరు కూడా అ ధైర్య పడద్దని సూచించారు. ఏది ఏమైనా మనం ఎవరికీ అన్యాయం చేయలేదు ప్రజలు మన వెన్నంటే ఉంటారు ఎవరు కూడా అధైర్య పడవద్దని ఆయన గుర్తు చేశారు. మనుషులలో సమస్యలు బాధలు వస్తూ పోతూ ఉంటాయి కానీ మనం పార్టీని విడిచిపోవద్దని ఆయన అన్నారు. ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు పాశం నర్సింలు, అరటి రఘు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాశం కుమార్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ వీరేష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు కాశిరాం, చింతల దాస్, మాజీ ఎంపీటీసీ సుధీర్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article