30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పలు ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఏర్గట్ల మండల కేంద్రంలో పలువురు ఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల ప్రమాదాల్లో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యుడిని కోల్పోయిన మరో పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఏర్గట్ల మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మచ్చ లక్ష్మణ్ కుమార్తె ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుకు తీవ్ర గాయమై చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త, ఏర్గట్ల మండల ఆర్‌ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ కారు ప్రమాదంలో కాలుకు గాయమవడంతో ఆయనను కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ మండల కార్యకర్త యూసుఫ్ తల్లి ఇటీవల మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఓదార్చారు.

 

Former minister calls on several close families.

 

ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం, గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, దోంచంద్ గ్రామ సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, సున్నపు అంజయ్య, బట్టపూర్ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, సొసైటీ చైర్మన్ బర్మ నరసయ్య, ఏర్గట్ల గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు గడ్డం రమేష్, కొలిప్యాక శ్రీనివాస్, బద్దం ప్రభాకర్, కుశ లింబాద్రి, రోక్కెడ మోహన్, ఏలేటి బాలకిషన్, బద్దం హనుమాండ్లు, లక్కం నరసయ్య, అట్లా పోశయ్య, నడిపి పోశెట్టి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Former minister calls on several close families.

More articles

Latest article