పలు ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి
ఏర్గట్ల, బతుకమ్మ : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఏర్గట్ల మండల కేంద్రంలో పలువురు ఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల ప్రమాదాల్లో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యుడిని కోల్పోయిన మరో పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఏర్గట్ల మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మచ్చ లక్ష్మణ్ కుమార్తె ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుకు తీవ్ర గాయమై చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్య...