నిషేదిత అల్ఫోజోం పట్టవేత

0 1,315

లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలంలోని సూరాయిపల్లి గ్రామంలో నిషేదిత అల్ఫోజోం  పట్టకున్నట్లు  ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. లింగంపేట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.  సూరాయిపల్లి గ్రామం లో రమేష్ గౌడ్ అనే వ్యక్తి నిషేధిత అల్ఫ్రోజోలం, ఇతర రసాయన లతో కల్తీ కల్లు తయారు చేస్తున్నారని  నమ్మదగిన సమాచారం అందింది వెంటనే లింగంపేట్ ఎస్ఐ పబ్బ అరుణ్ తన సిబ్బందితో సురాయిపల్లి  గ్రామంలో గల మహేశ్వరి రమేష్ గౌడ్ కి చెందిన కల్లు దుకాణంకి  వెళ్లి గదిలో తనిఖీలు నిర్వహించారు. ఒక ప్యాకెట్లో 30 గ్రాముల అల్ఫ్రోజలం కనబడింది.  వెంటనే స్వాధీనం చేసుకుని రమేష్ గౌడ్ విచారించారు. అల్ఫ్రోజోను నాగిరెడ్డి పేట్ మండలంలని రామక్కపల్లిలోని తన బామ్మర్ది కలాలి సత్యనారాయణ దగ్గర నుండి తీసుకుని వచ్చి దానితో కల్లు తయారు చేసి ప్రజలకి అమ్ముతున్నానని నేరం ఒప్పుకున్నాడు. కల్లు దుకాణంలో నుండి అల్ఫ్రోజాలంను, రెండు కల్లు సిసాలను, రమేష్ గౌడ్ దగ్గర నుండి ఒక సెల్ ఫోన్  స్వాధీనం చేసుకున్నారు.  కలాలి సత్యనారాయణ గౌడ్  తన బావ రమేష్ గౌడ్ కి దాదాపు రెండు సంవత్సరాల నుండి అల్ఫ్రోజాలం అమ్ముతున్నాను అని తెలిపాడు. కలాలి సత్యనారాయణ నుండి 20గ్రాముల అల్ఫ్రోజాలం, సెల్ ఫోన్  స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వద్ద నుండి మొత్తం 50గ్రాము ల నిషేదిత అల్ఫ్రోజాలంను, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ ఎస్ఐ అరుణ్ హెడ్ కానిస్టేబుల్ రాజేందేర్, కానిస్టేబుల్ భైరవ ప్రసాద్, రమేష్, రామస్వామి,సంపత్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.