24 C
Hyderabad
Sunday, August 2, 2026

2వ టౌన్ ఏరియాలో ఫుట్ పెట్రోలింగ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పరిధిలో గల గాజుల్ పేట్, ఖిల్లా రోడ్డు,  బర్కత్ పూర, శివాజినగర్, హతాయిగల్లి, బడా బజార్, దారుగల్లిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆదేశాల మేరకు నగర సిఐ శ్రీనివాసు రాజు, 2 వ టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి వాహనాల తనిఖీ చేశారు. నగరంలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలు, వాహనాల చోరిలు, నేరాల నియంత్రణ, మైనర్ల డ్రైవింగ్ నిరోధించడానికి 40 మంది పోలీసు సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 38 బైక్ లను, 6 ఆటోలను సీజ్ చేశారు.

Foot patrol in the 2nd town area

More articles

Latest article