27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డెక్కిన అన్నదాతలు

Must read

📰 Generate e-Paper Clip

  • రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు

 

బతుకమ్మ భిక్కనూరు: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ తో భిక్కనూరు అన్నదాతలు శనివారం తడిసిన ధాన్యాన్ని రహదారిపై పోసి రాస్తారోకో నిర్వహించారు. రైతులు, బి ఆర్ఎస్ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు  చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే గల వర్షాలకు తమ ధాన్యం తడిసి మొలకలు రావడం జరిగిందని, వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు భూమయ్య,  ఎస్ఐ ఆంజనేయులు చేరుకొని ధాన్యం వెంటనే కాంట చేయడం జరుగుతుందని రైతులు ఆందోళన విరమించాలని కోరడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో  రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Food donors who hit the road

More articles

Latest article