28.9 C
Hyderabad

వెయ్యి కోట్ల టన్నెల్ లోకి వరద నీరు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రారంభమైన 13 రోజులకే మూసివేత

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఢిల్లీ – ముంబై హైవేపై నిర్మించిన ముకుంద్రా టన్నెల్‌లోకి భారీగా వర్షపు నీరు చేరి మడుగులా మారింది. సుమారు రూ.1,000 కోట్లతో నిర్మించిన ఈ టన్నెల్‌లో డ్రైనేజీ వ్యవస్థ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మరో టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో పూణే రహదారిపై వారం రోజుల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు లక్నో – కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌ హైవే 84 కిలోమీటర్ల మేర వర్షాలకు దెబ్బతిన్నట్లు సమాచారం. టోల్‌ ప్రారంభించిన 13 రోజులకే దానిని నిలిపివేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పలు రహదారి ప్రాజెక్టులు భారీ వర్షాలకు దెబ్బతింటుండటంతో నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

More articles

Latest article