. . . ప్రారంభమైన 13 రోజులకే మూసివేత
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఢిల్లీ – ముంబై హైవేపై నిర్మించిన ముకుంద్రా టన్నెల్‌లోకి భారీగా వర్షపు నీరు చేరి మడుగులా మారింది. సుమారు రూ.1,000 కోట్లతో నిర్మించిన ఈ టన్నెల్‌లో డ్రైనేజీ వ్యవస్థ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మరో టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో పూణే రహదారిపై వారం రోజుల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు లక్నో – కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే 84 కిలోమీటర్ల మేర వర్షాలకు దెబ్బతిన్నట్లు సమాచారం. టోల్ ప్రారంభించిన 13 రోజులకే దానిని నిలిపివేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పలు రహదారి ప్రాజెక్టులు భారీ వర్షాలకు దెబ్బతింటుండటంతో నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.