25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్సిపాలిటీ పర్మిషన్ తోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ

భీమ్ గల్, బతుకమ్మ : 

 

భీంగల్ పట్టణ కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై ఫ్లెక్సీలు మున్సిపాలిటీ పర్మిషన్ తోనే ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ తెలిపారు. అన్ని పార్టీల నాయకులు, ఇతరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ప్రధాన రహదారి తో పాటు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంబాలకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వలన ప్రమాదాలు వాటిల్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు మున్సిపల్ ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని కమీషనర్ తెలిపారు. డివైడర్ మధ్యలో ఉన్న పోల్స్ కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వలన పోల్స్ కు ఉన్న విద్యుత్ దీపాలు మరమ్మతు చేయడానికి ఆస్కారం లేకుండా అవుతుందన్నారు. ఇప్పటికే  ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీ లు తొలగించాలని, భవిష్యత్తు లో ఫ్లెక్సీల ఏర్పాటు కు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఎవరైనా మున్సిపల్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమీషనర్ హెచ్చరించారు.

More articles

Latest article