తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నివాసంలో అగ్నిప్రమాదం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర వ్యవసాయ కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్ నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యుట్ తో అగ్ని ప్రమాధం జరిగింది. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. మంటలు వేగంగా విస్థరించడంతో అగ్నికి చాలా బాగం ఆహుతైంది. అగ్నిమాపక శాఖకు ప్రమాదం గురించి సమాచారం అందించడంతో ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో తీవ్ర ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు గడుగు గంగాధర్ అదే నివాసంలో ఉన్నప్పటికి ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు... ....