24 C
Hyderabad
Sunday, August 2, 2026

పైనాన్స్ వేదింపులు వ్యక్తి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 

 కామారెడ్డి, బతుకమ్మ :

ప్రైవేట్ పైనాన్స్ సంస్థ వాయిదాల ( ఇన్ స్టాల్ మెంట్ ) లకోసం వేదించడంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం లోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన సుంకరీ ప్రవీణ్ గౌడ్ ప్రవేట్ ఫైనాన్స్ వేధింపులకు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పైవ్ స్టార్ పైనాన్స్ సంస్థ నుంచి ప్రవిణ్ గౌడ్  మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకోన్నట్టు తెలిసింది. ఒక ఇన్స్టాల్మెంట్ ఎనిమిది వేల రూపాయల కోసం వేధించడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బిబీ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article