26.3 C
Hyderabad
Monday, August 3, 2026

జిపి కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు వాటర్ మెన్ మరుపాక  బాల ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.గ్రామానికి అతను చేసిన సేవలు చిరస్మరణీయమని వారి కుటుంబానికి మనోదైర్యం కల్పిస్తూ బీజేపీ  బొప్పాపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, 1000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే భవిష్యత్తు లో వారి పిల్లల చదువుకు మావంతు సహకారాలు అందిస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమం లో  కొండాపూరం సత్యం రెడ్డి, లింగమ్మగారి భాస్కర్, నిమ్మల సత్యం, వరుస రాకేష్, కానమేని వినయ్,అల్లే రాజు, అనరసి కిష్టయ్య, ఇబుది హన్మంత్, ఇబుది రవి,మారవేణి రంజిత్ కుమార్, కులసంఘ సభ్యులు మాస్కురి శేఖర్,మరుపాక సునీల్, మెరిదొడ్డి శ్రీనివాస్,మరుపాక శ్రీనివాస్, మెరిదొడ్డి ఎల్లయ్య, మరుపాక దేవయ్య,మాస్కురి శ్రీకాంత్, మరుపాక రామచంద్రం, మరుపాక నారాయణ, తెడ్డు శివయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article