జిపి కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు వాటర్ మెన్ మరుపాక  బాల ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.గ్రామానికి అతను చేసిన సేవలు చిరస్మరణీయమని వారి కుటుంబానికి మనోదైర్యం కల్పిస్తూ బీజేపీ  బొప్పాపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, 1000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే భవిష్యత్తు లో వారి పిల్లల చదువుకు మావంతు సహకారాలు అందిస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ...