బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రూప శ్రీ ఎంపికైనట్లు పిటి నరేందర్ తెలిపారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఉమ్మడి నిజామబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి లో కరాటే లో ప్రతిభను చూపించి జాతీయస్థాయికి ఎంపికైన జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రూప శ్రీ ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్అ భినందించారు. కరాటే విద్యలో రాష్ట్రస్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకొని ఎంపికైన రూప శ్రీ జాతీయస్థాయిలో డిసెంబర్ 9న ఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయిలో పోటీలో పాల్గొంటుందని అక్కడ కూడా ప్రతిభను కనబరిచి జంగంపల్లి గ్రామానికి స్కూల్ కి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
