బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలం ఓ పత్రిక జర్నలిస్ట్ సత్యనారాయణ ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు ) కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు, పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్ అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లతీఫ్, జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, శ్రీనివాస్, రాజేష్, నాగరాజు, రంజిత్, శంకర్, తదితరులు ఉన్నారు.
