వరంగల్ జిల్లాలో ఘటన
వరంగల్, బతుకమ్మ: పోలీస్ శాఖలో మహిళా కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి.తాజాగా వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన అర్చన అనే మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆమెకు 2022 లో వివాహం కాగా, కొద్దిరోజులకే విడాకులయ్యాయి. మానసినవేదన చెందిన అర్చన కాజీపేట దర్గా ప్రాంతంలోని తన ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల పెళ్లి కావడం లేదని నీలిబండ తండాలో నీలిమ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
