నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దాదాపు ఐదు సంవత్సరాలుగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల మనగడే కష్టం అయిందని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు విద్యార్థులకు ఉచితంగా ఎంతో నాణ్యమైన విద్యను ఇస్తున్నాయని, ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని గుర్తు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా కళాశాల నడుపుతున్న తమకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గత కొన్ని నెలలుగా తాము తమ కళాశాలల లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని కళాశాలల మనుగడే ప్రశ్నార్థకమైందని, మా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విడుదల చేయాలని విన్నపం చేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ లోని అన్ని కళాశాల యాజమాన్యాలు మీటింగ్లో పాల్గొని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాయని ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ అన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు రాని పక్షంలో కళాశాలలు మూతపడటం ఖాయమని, అప్పుడు ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న వేలాది మంది జీవితాలు రోడ్డుమీదికి వస్తాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు జైపాల్ రెడ్డి తో పాటు నరాల సుధాకర్, గురువేందర్ రెడ్డి, సూర్య ప్రకాష్, సంజీవ్, సత్యం, హకీమ్, రమణ, వెంకట కిషన్, భూమయ్య, హరికృష్ణ, విజయ్, నవీన్, చందన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.