. . . రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి
డిచ్ పల్లి, బతుకమ్మ :
ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో ప్రామాణికత, స్పష్టత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ పై ఒకరోజు వర్క్ షాప్ ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జి.రాంబాబు మాట్లాడతూ ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ఎలా తయారుచేయాలి, ప్రాక్టికల్ పద్ధతులు ఏమిటి, అలాగే హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ విభాగాల్లో ప్రాజెక్ట్ వర్క్ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి వాణి, ప్రొఫెసర్ అపర్ణ బీఓఎస్ డాక్టర్ రాజేశ్వరి, అధ్యాపకులు డాక్టర్ కిరణ్ రాథోడ్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
