25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హత్యాయత్నం కేసులో తండ్రీకొడుకులకు జైలుశిక్షలు

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పు

 

నిజామాబాద్, బతుకమ్మ : ఒకరిపై హత్యయత్నం చేసిన కేసు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో తండ్రీకొడుకులకు జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ మంగళవారం తీర్పు వెలువరించారు.గంగోని నవీన్ కు ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్ష, అతని తండ్రికి మూడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ ఇరవై ఎనిమిది పేజీల తీర్పు చెప్పారు.నవీపేట్ మండలం లింగపూర్ గ్రామానికి చెందిన గంగోని నవీన్, గంగోని హన్మాండ్లు తండ్రికొడుకులు వీరికి అదే గ్రామ శివారులో వ్యవసాయభూమి ఉన్నది. అదే గ్రామ నివాసులైన తండ్రికొడుకులు కేశపురం గంగారామ్, కేశపురం మహేష్ లకు కూడా వ్యయసాయ భూమి ఉంది. వీరికి పక్కపక్కనే భూములు ఉండటంతో భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. 25 మే, 2020 న పొలం దగ్గర కక్షను మనసులో ఉంచుకున్న నవీన్, హన్మాండ్లు మహేష్ ఒంటరిగా ఉన్నది చూసి హన్మాండ్లు మహేష్ ను వెనుకనుంచి బలంగా పట్టుకోగ నవీన్ పారతో అంతే బలంగా మహేష్ తలపై కొట్టి గాయ పరిచాడనే హత్యయత్నం నేరారోపణ కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు నిర్దారించారు.నవీన్ కు ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. హన్మాండ్లు కు మూడు సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య నవీపేట్ పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

More articles

Latest article