హత్యాయత్నం కేసులో తండ్రీకొడుకులకు జైలుశిక్షలు

నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పు   నిజామాబాద్, బతుకమ్మ : ఒకరిపై హత్యయత్నం చేసిన కేసు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో తండ్రీకొడుకులకు జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ మంగళవారం తీర్పు వెలువరించారు.గంగోని నవీన్ కు ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్ష, అతని తండ్రికి మూడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ ఇరవై ఎనిమిది పేజీల తీర్పు చెప్పారు.నవీపేట్ మండలం లింగపూర్ గ్రామానికి చెందిన గంగోని నవీన్, గంగోని హన్మాండ్లు తండ్రికొడుకులు వీరికి అదే గ్రామ...