23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

టిప్పర్ ఢీకొని తండ్రీకొడుకులకు గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తాలో శనివారం టిప్పర్, బైక్ ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మోపాల్ మండలం న్యాల్ కల్ గ్రామానికి చెందిన భూమారావ్, అతని కుమారుడు ధనుష్ కు గాయాలయ్యాయి. పులాంగ్ చౌరస్తా నుంచి వర్నీ చౌరస్తా వైపు వెళ్తున్న టిప్పర్ పెద్ద బజార్ నుంచి న్యాల్ కల్ వైపు ద్విచ్రక వాహనంపై వెళుతున్న తండ్రీకొడుకులను రాజా రాజేంద్ర చౌరస్తా వద్ద ఢీకొట్టింది.  ఐదో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Father and son injured in tipper collision

More articles

Latest article