ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులు వడ్లను దళారులకు అమ్ముకోవద్దని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని గిట్టుబాటు ధరను పొందాలన్నారు. తొందరపడి దళారులకు తమ పంటను అమ్మి నష్టపోవద్దని కోరారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 17 ఐ కే పి సెంటర్లు, 10 ఫ్యాక్స్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని అన్నారు.రైతులకు తూకంలో ఎలాంటి మోసం లేకుండా వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించే బాధ్యతను ఐకెపి,ఫ్యాక్స్ సెంటర్ల నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు.గతంలో మాదిరి కాకుండా రైతులకు ఎట్టి పరిస్థితులలో నష్టం రానివ్వవద్దని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు.రైస్ మిల్లులను జిల్లా పౌరసరపరాధికారులు ఆయా సెంటర్లకు కేటాయిస్తారని తెలిపారు. దానికి అనుగుణంగానే వడ్లను తరలించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతో మహిళా సంఘాలకు ఐకెపి కొనుగోలు సెంటర్లను అప్పగించడం జరిగిందన్నారు. మండలంలోని బుగ్గ రాజేశ్వర తండా అల్మాస్పూర్,కిస్టు నాయక్ తండా,రాజన్నపేట,రాచర్ల బొప్పాపూర్,బాకురుపల్లి తండా గ్రామాలలో గురువారం ఐకెపి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించడం జరిగిందన్నారు. ఐకెపి ఇన్చార్జ్ ఏపిఎం లక్ష్మణ్ తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, డైరెక్టర్లు గణపతి,చెట్టుపల్లి బాలయ్య,గుల్లపల్లి లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి,నాయకులు ఎస్ కే సాహెబ్,కొండాపురం శ్రీనివాసరెడ్డి, చేపూరి రాజేశం,కల్లూరు బాపురెడ్డి, ముక్క శంకర్,సిరిసిల్ల సురేష్, సోనవేన్ రాజయ్య, మందాటి దేవేందర్,భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
