రైతులు దళారులకు వడ్లను అమ్ముకోవద్దు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులు వడ్లను దళారులకు అమ్ముకోవద్దని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని గిట్టుబాటు ధరను పొందాలన్నారు. తొందరపడి దళారులకు తమ పంటను అమ్మి నష్టపోవద్దని కోరారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 17 ఐ కే పి సెంటర్లు, 10 ఫ్యాక్స్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని అన్నారు.రైతులకు తూకంలో ఎలాంటి మోసం లేకుండా వడ్లను కొనుగోలు...