28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్

 

మద్నూర్, బతుకమ్మ: పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ గురువారం ప్రారంభించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు డోంగ్లి మండలంలోని మొఘా గ్రామంలో ప్రారంభించినట్లు వారు తెలిపారు. పొద్దుతిరుగుడు క్వింటల్ ధర రూ.7280 వేలు పలుకుతుంది. రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శివ, ఏఈఓ విశాల్, పిఎసిఎస్ చైర్మన్ రామ్ పటేల్, మాజీ ఎంపిటిసి హన్మంత్ పటేల్, ఉప సర్పంచ్ నాగ్నాథ్, సంగ్రామ్ పటేల్, మల్లుగొండ, సుధాకర్ గౌడ్, మోహిన్,సాయి కొండ, సంతోష్, మధు పటేల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article