వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చేగుంట, నల్గొండలోని త్రిపురాంతకం, శాలిగౌరారం, సూర్యాపేట జిల్లా అనంతగిరి పీఎసీఎస్ ల వద్ద రైతులు ఉదయం నుంచి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. అలాగే పలు పీఎసీఎస్ ల వద్ద ఆధార్ కార్డులు, చెప్పులు క్యూలైన్లలో ఉంచారు. పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు పహారా కాస్తున్నారు.
