Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 11:55 am Posted by : ramakrishna

యూరియా కోసం రైతుల తిప్పలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చేగుంట, నల్గొండలోని త్రిపురాంతకం, శాలిగౌరారం, సూర్యాపేట జిల్లా అనంతగిరి పీఎసీఎస్ ల వద్ద రైతులు ఉదయం నుంచి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.  అలాగే పలు పీఎసీఎస్ ల వద్ద  ఆధార్ కార్డులు, చెప్పులు క్యూలైన్లలో ఉంచారు.  పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు పహారా కాస్తున్నారు.