25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బ్యాంకింగ్ సేవలపై రైతులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన మినార్ పల్లి గ్రామంలో, సహకార సంఘ భవనంలో గురువారం రైతులకు బ్యాంకింగ్ సౌకర్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు ఎం.రవీందర్ బాబు అధ్యక్షతన రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు జనరల్ మేనేజర్  లింబాద్రి, మేనేజర్ లక్ష్మీ ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు బ్యాంక్ రుణాలపై పూర్తి వివరాలు అందించారు. ప్రధానంగా “కర్షక మిత్ర, గోల్డ్ లోన్స్” పథకం పై వివరణ ఇచ్చారు. రైతులకు తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పంట రుణాలు, మరియు వ్యవసాయ సంబంధిత రుణాలు ఎలా పొందవచ్చో వివరించారు. అంతేగాక, బ్యాంక్ డిపాజిట్స్‌పై వడ్డీ రేట్ల గురించి స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా గ్రామీణ రైతులకు ఆర్థిక సేవల ప్రాధాన్యత, ఉపయోగకరతపై స్పష్టత ఏర్పడింది.

More articles

Latest article