బ్యాంకింగ్ సేవలపై రైతులకు అవగాహన
బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన మినార్ పల్లి గ్రామంలో, సహకార సంఘ భవనంలో గురువారం రైతులకు బ్యాంకింగ్ సౌకర్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు ఎం.రవీందర్ బాబు అధ్యక్షతన రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ లింబాద్రి, మేనేజర్ లక్ష్మీ ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు బ్యాంక్ రుణాలపై పూర్తి వివరాలు అందించారు. ప్రధానంగా "కర్షక మిత్ర, గోల్డ్ లోన్స్" పథకం పై వివరణ ఇచ్చారు. రైతులకు తక్కువ...