- ఎస్సై హామీ తో కిందికి దిగి వచ్చిన రైతు
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామంలో కుంట ప్రభాకర్ రెడ్డి తన ఇంటి ముందు కూల్చివేసిన పశువుల తొట్టిని గ్రామస్తులు తిరిగి అదే చోట నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటి ముందు ఉన్న వాటర్ ట్యాంక్ ను మంగళవారం ఎక్కడంతో పాటుగా గుర్తుతెలియని పురుగుల మందును తాగి హల్చల్ చేశారు. తన నూతనంగా నిర్మించుకున్న ఇంటి ముందు ఉన్న పశువుల తొట్టిని ప్రభాకర్ రెడ్డి జెసిబి తో కూల్చివేశాడు. ఈ మేరకు గ్రామస్తులు అతడిని పంచాయతీ వద్దకు పిలిపించి ఎందుకు కూల్చి వేసావ్ అని అడగగా తన ఇంటికి అడ్డు వస్తుందని వేరే చోట కట్టించి ఇస్తానని చెప్పాడు. కూల్చి వేసిన స్థలంలోనే కట్టించి ఇవ్వాలని లేనియెడల గ్రామంలో లేనిపోని అల్లర్లు జరుగుతాయని, అర్థం చేసుకొని అదే చోట నిర్మించాలని సూచించారు. దానికి ఒప్పుకొని ప్రభాకర్ రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోగా అదే స్థలంలో గ్రామస్తులు పశువులు తోటి నిర్మించేందుకు ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా గ్రామస్తులు పై కోపంతో గుర్తుతెలియని పురుగుల మందును వెంటబెట్టుకొని వాటర్ ట్యాంక్ ఎక్కి కొంచెం వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగి నిరసన తెలిపాడు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఎంత సముదాయించిన కిందికి దిగి రాకపోవడంతో పోలీసులకు వారు సమాచారం ఇవ్వగా ఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకొని సముదాయించి కిందికి దించిపించాడు . వెంటనే అతడిని పోలీసులు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
