బతుకమ్మ, వేల్పూర్ :-మండలంలోనీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ గ్రూప్4 రాత పరీక్ష రాయగా కానిస్టేబుల్ విజయ్ రామరవు ఇటీవలనే గ్రూప్4 లో ఉద్యోగం వచ్చింది. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ గా నియామకయ్యారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఎస్సై బి.సంజీవ్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం విజయ్ రామారావు ను శాలువాతో సన్మానించి వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై సంజీవ్ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా మంచి పేరు సాధించుకున్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. విజయ్ రామారావు ను అభినందించారు. విజయ్ రామారావు సౌథ్ జోన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా బదిలీపై వెళ్తున్నారు.
