27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ వాట్సాప్ అకౌంట్‌

Must read

📰 Generate e-Paper Clip

  •  పలువులు అధికారులతో చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్ళు
  •  పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏవో
  •  అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పోలీసుల విన్నపం

బతుకమ్మ, కామారెడ్డి : సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకులతో అందినకాడికి కాజేస్తున్నారు. అంతేకాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ డిపి అకౌంట్ ఓపెన్ చేసి మోసం చేసిన ఘటన మరువకముందే
అదే క్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాట్సప్‌ డీపీతో బుధవారం నకిలీ అకౌంట్‌ను క్రియేట్‌ చేశారు. పలువురు అధికారులతో చాటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టర్‌ దృష్టికి తేవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కామారెడ్డి కలెక్టరేట్ ఏవో దేవనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే సంబంధిత అకౌంట్‌ ఫోన్‌ నెంబర్‌పై పోలీసులు దృష్టి పెట్టారు. +94782893140 నెంబర్‌తో నకిలీ అకౌంట్‌ను సృష్టించారని గుర్తించారు.ఈ నెంబర్‌ నుంచి కాల్‌ చేసిన, చాటింగ్‌ చేసిన వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్‌ నేరాల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా దేవన్ పల్లి ఎస్ఐ రాజు కోరారు.

More articles

Latest article