23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

జ్యూవేలరి షాప్ లో చోరికి విఫల యత్నం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుభాష్ నగర్ రైతు బజార్ వద్ద శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ లో చోరీకి విఫల యత్నం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జువెలరీ షాప్ లో దొంగతనం చేయుటకు ప్రయత్నించారు. స్థానిక త్రీ టౌన్ బ్లూ కోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండడం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దొంగలు పారిపోయారు. షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరీ బాబు తెలిపారు.

Failed robbery attempt at jewelry shop

More articles

Latest article