- బోధన్ యువత హెచ్చరిక
బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు యువత ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ యువత నాయకులు మాట్లాడుతూ, ఫ్యాక్టరీ కార్మికుల పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, అలాగే ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు అండగా తీసుకోవాలని వారు కోరారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తక్షణం స్పందించి, కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హితవు పలికారు. వాగ్దానాలను విస్మరిస్తే బోధన్ యువత ఆధ్వర్యంలో విపులమైన ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్లూరి శ్రీనివాస్, బోధన్ యువత సభ్యులు గంధం రాజేష్, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివెసు సంతోష్ కురుమ, కార్మిక నాయకుడు రవిశంకర్ గౌడ్, బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ నీరడి రవి, బిజెపి నాయకుడు కందికట్ల వాసు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు జూనైద్, బారసా నాయకులు ప్రవీణ్ జాదవ్, మహ్మద్ షైక్, నాగరాజు (AISB), ఎం.డి. మోసిన్ (AIFDS), మీసాల నాగేష్ (TGVP) తదితరులు పాల్గొన్నారు.
