ఎన్నికలకు ముందే ఫ్యాక్టరీ హామీని నిలబెట్టుకోవాలి
బోధన్ యువత హెచ్చరిక బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు యువత ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ యువత నాయకులు మాట్లాడుతూ, ఫ్యాక్టరీ కార్మికుల పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, అలాగే ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు అండగా తీసుకోవాలని వారు కోరారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి...