24.7 C
Hyderabad
Monday, August 3, 2026

డిసిసిబి, పిఎసీఎస్ఎస్ ల పాలకవర్గాల పదవీ కాలం పొడిగింపు

Must read

📰 Generate e-Paper Clip

హైద్రాబాద్, బతుకమ్మ : వ్యవసాయ, సహకార శాఖ పరిధిలోని పిఎసీఎస్ఎస్, డిసిసిబిలు, టిజీ క్యాబ్ ల పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగిస్తు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు  జారీ చేసింది. ఈ మేరకు జిఓ ఆర్ టినం 386 ను వెలువరించింది. పిఎసీఎస్ఎస్, డిసిసిబిలు, టిజి క్యాబ్ ల వ్యవహారాలు నిర్వహించడానికి  పర్సన్ ఇంచార్జీలను నియమిస్తు  సహకార శాఖ డైరెక్టర్ కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ లకు ఆదేశాలు జారీ చేశారు. 1964 సెక్షన్ 32(7) (ఎ) ప్రకారం సంబంధిత పదవికాలం పూర్తయిన తేదీల నుంచి ఆరు నెలల పాటు ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు  ఏది ముందుఐతే అది వరకు అని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే ఆరు నెలల పదవి కాలం పొడిగించబడగా, మరోసారి ఆరు నెలల పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఇప్పట్లో పిఎసీఎస్ఎస్, డిసిసిబిల పాలకవర్గాల ఎన్నికలు జరుగవని తేట తెల్లమైంది. పదవి కాలంలో పొడగింపుతో ప్రభుత్వానికి నిజామాబాద్ డిసిసిబి చైర్మెన్ కుంట రమేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పొడిగింపు కాలంలో రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.

Extension of tenure of DCCB and PACSS governing bodies

More articles

Latest article