–గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక ఎక్స్ గ్రేషియా
–గల్ఫ్ లో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు
–“ప్రవాసి ప్రజావాణి”కౌంటర్ ఏర్పాటు
–గల్ఫ్ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి
–కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్
ఇందల్వాయి,బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక ఎక్స్ గ్రేషియా క్రింద ప్రమాదవశత్తు గల్ఫ్ లో మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు ఇవ్వనుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ తెలిపారు. ఇందల్వాయి మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా నవిన్ గౌడ్ మాట్లాడుతు… ఇన్నేళ్లుగా పాలించిన వివిధ పార్టీల ముఖ్యమంత్రులు ఇప్పటివరకు గల్ఫ్ కార్మికుల కొరకు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. గతంలో గల్ఫ్ కార్మికులు ముఖ్యమంత్రులను కలిసి ఎన్నారై పాలసీ కావాలి తమ సమస్యలను పరిష్కరించాలని పదేపదే కోరిన పట్టించుకో లేదన్నారు. ఎన్నికలలో హామీలు ఇవ్వడం తప్ప ఎలాంటి హామీలు కానీ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. గత పాలకులకు గల్ఫ్ కార్మికుల గోస తగిలి నేడు చిప్ప చేతికి రావడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల అమలను సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ఇచ్చిన హామీల మేరకు నెరవేరుస్తూ ప్రజల కలలను నిజం చేస్తూ ప్రజలలో ఆనందం చూస్తూ మరోపక్క గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేకంగా చొరవ తీసుకొని గల్ఫ్ లో ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించడం పట్ల గల్ఫ్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని ఆస్వాదించాలి తప్ప దురుద్దేశంతో ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఈర్ల సాహేందర్,ఎల్ఐసి గంగాధర్, గంగాధర్,సుధాకర్ ,సంతోష్ రెడ్డి,గంగా రెడ్డి , బైరి రవి,జెగ్గ లక్ష్మణ్,చంటి తదితరులు పాల్గొన్నారు.
