27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నియామక పత్రం అందజేసిన కలెక్టర్ 

 

నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ : 

 

నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడికి ఎక్సైజ్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తన ఛాంబర్ లో నియామక పత్రం అందజేశారు. గత నెల 23వ తేదీ విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి 31 జనవరి రోజున న పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో మరణించిన విషయం తెల్సిందే.ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు సమాజ శ్రేయస్సు కొరకు విధి నిర్వహణలో కుమారి గాజుల సౌమ్య చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడుతూ స్వయంగా అంత్యక్రియలకు హాజరై ప్రభుత్వం తరపున అంత్యక్రియలను అధికార లాంచనాలతో జరిపించారు. సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా సౌమ్య కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కు ను అందజేశారు.అదే విధంగా సోమవారం సౌమ్య తమ్ముడు గాజుల శ్రవణ్ కు ఎక్సైజ్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా నియామిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంఘటన జరిగిన నెల రోజుల లోపే సౌమ్య కుటుంబానికి కోటి రూపాయలు,సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని తెలిపారు. సౌమ్య మరణానికి కారణం అయినా దుండగులను కఠినంగా శిక్షిస్తామని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లోఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి , నోడల్ డీ పీ ఈ ఓ మల్లారెడ్డి, సీ ఐ స్వప్న, ఈ స్సై మల్లేష్, ఎక్సైజ్ కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు రవి, కార్యదర్శి చంద్ర మోహన్ లు పాల్గొన్నారు.

 

 

 

More articles

Latest article