. . . ఐదుగురిని అరెస్ట్ చేసిన ఆబ్కారీ శాఖ
. . . 13 కిలోల గంజాయి స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మధ్య ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు జరుగుతున్న గంజాయి రవాణా నెట్ వర్క్ ను ఎక్సైజ్ అధికారులు చేదించారు. ఐదుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గురువారం నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు…. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ స్వప్న ఆధ్వర్యంలో గురువారం ఉదయం నగరంలోని బైపాస్ వద్ద తనిఖీలు నిర్వహించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దేవుల తండా కు చెందిన పూజా పవార్, ఆదిలాబాద్ జిల్లా కుప్టీకి చెందిన దుర్పదాబాయి జాదవ్ అనే ఇద్దరు మహిళలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ కు చెందిన కిషన్ మోతి రాం దాలే,మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఉమర్ ఖేడ్ కు చెందిన ఇంద్రజిత్ టాగ్రెలతో పాటు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ కు చెందిన దుంజ వెంకట్రావ్ లను పట్టుకున్నారు. వారిని పట్టుకుని విచారించగా మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ జరుగుతున్న గంజాయి రవాణా వివరాలు బహిర్గతమయ్యాయి… పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పూజ పవార్, ధుర్పాద బాయ్ జాదవ్ అనే మహిళలు మధ్య ప్రదేశ్ లోని సిర్పుర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కేజీ గంజాయి రూ.9,000 కు కొనుగోలు చేసేవారు. అక్కడ కొనుగోలు చేసిన గంజాయి మ మహరాష్ట్రలోని కిన్వట్ లో కిషన్ మోతి రాం, ఇంద్రజిత్ టాగ్రెలతో బస్ ద్వార నిర్మల్ కు వచ్చి అక్కడి నుంచి నిజామాబాద్ లో దుంజ వెంకట్ రామ్ కు ఇస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 13 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఎక్సైజ్ శాఖ దాడులు సీఐ స్వప్న పాటు ఎస్సైలు మల్లేష్, సుస్మిత లు సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ తదితరులు పాల్గోన్నారు.

మధ్య ప్రదేశ్ గంజాయి నెట్ వర్క్ లో కిలేడి…
మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర మీదుగా తెలంగాణ కు గంజాయి రవాణా లో కిలేడి పాత్ర ఉందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కుప్టీకి చెందిన దుర్పదబాయ్ జాదవ్ భర్త రమేష్ గంజాయి రవాణా కేసులో నిందితుడు. అతడు చనిపోవడంతో అతడు చేసే గంజాయి దందాను ధుర్పధబాయి జాదవ్ చేపట్టిన రవాణా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒకసారి నిజామాబాద్ కు గంజాయి విజయవంతంగా సరఫరా చేసినట్లు తెలిపారు. రెండో ప్రయత్నంలో దొరికినట్టు ఈ ఎస్ తెలిపారు.