24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పీజీ పరీక్షల నిర్వహణ తీరు పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణ యూనివర్సిటీ, బతుకమ్మ:  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో కొనసాగుతున్న పీజీ ఒకటో, మూడో సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు ఎం ఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం. కాం, ఎంబీఏ, ఎంసీఏ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ )( మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి ), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఐ ఎం బి ఏ) ఏడో, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ తీరును వీసీ యాదగిరిరావు పరిశీలించారు. విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  పీజీ పరీక్షలు కొనసాగుతుండగా, వీసీ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీసీ వెంట అడిషనల్ కంట్రోలర్ బి సాయిలు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. 151 మంది విద్యార్థులకు గాను 148 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

More articles

Latest article