నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి జిల్లా సహకార సంఘాల కార్యదర్శులతో శుక్రవారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ బాదావత్ తారాచందు నాయక్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల రైతుల సమస్యలపై, రైతు రుణమాఫీ వై, రైతులకు సంబంధించిన యూరియా బి ఏ పి ఇతర రైతు సమస్యలపై చర్చించారు. అనంతరం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైన గడుగు గంగాధర్ ను చైర్మన్, కార్యదర్శులు సన్మానించారు.

