… కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే ధన్ పాల్
… పరిశీలిస్తామన్నా కమిషనర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ ల వారీగా ఓటర్ల తుది జాబితాలో తప్పులతడక గా నమోదయ్యాయి. ఇందూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ అవకతవకలు గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన తప్పులు తడకగానే ఫైనల్ లిస్ట్ ఇవ్వడంతో ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్దకమైందని కార్యకర్తల పక్షాన మున్సిపాల్ కమిషనర్ దిలీప్ కుమార్ ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. ఇటీవల అభ్యంతరాల పరిశీలనకు స్వీకరించిన ఎలాంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత డివిజన్ ల కు సంబంధం లేని ఓటర్లను ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. కనీసం కాలనీ పేరు కూడా లేకుండా కేవలం నిజామాబాద్ పేరుతోనే వందల ఓట్లను ఇతర డివిజన్ లలో చేపించారని తెలిపారు. స్థానికంగా అభ్యంతరాలను మళ్లీ పరిశీలించి కొత్త జాబితాను చేయాలని కోరారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ దిలీప్ కుమార్ హామీ ఇచ్చారు.
