రుద్రూర్, బతుకమ్మ న్యూస్
బతుకమ్మ నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై పి. సాయన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా నిజాలను నిర్భయంగా రాస్తూ అతీత కాలంలోనే అనేక మంది పాఠకులను సొంతం చేసుకుందన్నారు. పాఠకుల నుండి విశిష్ట ఆదరణ పొందుతున్న బతుకమ్మ పత్రికకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, బతుకమ్మ ప్రతినిధి ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
