నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి ఒక్కరూ ఉద్యోగ విధుల్లో సమయపాలన పాటించి, ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర వేయుటలో ప్రముఖ పాత్ర వహించాలని జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. శనివారం టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో పశువైద్య& పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మీసాల మంజుల- యశ్వంతరావు బోస్లే పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమయపాలన పాటిస్తూ, ఉద్యోగ విధుల్లో గురుతర బాధ్యత వహించి, ఉత్తమ ఉద్యోగిగా అవార్డు పొంది, నేడు పదవి విరమణ పొందుతున్న మంజులని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంజులని మార్గ దర్శకులు గా భావించి, ఉద్యోగుల హక్కుల సాధన రావడానికి సిద్ధం కావాలని ఆశిస్తూ, టీఎన్జీవో మహిళా ఉపాధ్యక్షురాలు అయి పదవి విరమణ పొందుతున్న మీసాల మంజుల కి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సదరు శాఖ సంయుక్త సంచాలకులు గంగాధరయ్య, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, సదరు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ బసవరెడ్డి, డాక్టర్ రోహిత్ రెడ్డి, టిఎన్జీవో ఉపాధ్యక్షులు కేపీ సునీత, జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, మహేందర్, గంగరాజు, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్, గీతారెడ్డి, గురుచరణ్, పశుసంవర్ధక శాఖ ఫోరం అధ్యక్షురాలు వినీత, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
