26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల తన నివాసానికి విచ్చేసిన ఎన్నికల సంఘం ప్రతినిధులకు తన వ్యక్తిగత, కుటుంబ ఓటు వివరాలను మాజీ శాసనసభ పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ అందజేశారు. బిఎల్ఓ ఇచ్చిన ఎస్ఐఆర్ పత్రాన్ని వివరాలతో నింపి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అయిన మన భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ సర్వేలో ప్రతి ఓటరు పాల్గొనాలని ఎన్నికల సంఘం ప్రతినిధులు అడిగిన వివరాలను అందజేయాలని సూచించారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకునే యువత కూడా పెద్ద సంఖ్యలో ఓటును నమోదు చేసుకోవాలని, నకిలీ ఓట్లను గుర్తించి ప్రతినిధులకు తెలియజేయాలని తద్వారా పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.  వారి వెంట బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్ ఉన్నారు.

More articles

Latest article