హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ప్రభుత్వం నూతన రేరా చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాస రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అథారిటీ (టీజీరేరా) చైర్మన్ గా కె.ఎస్.శ్రీనివాస్ రాజును నియమిస్తూ శనివారం మెట్రో పాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1999 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీనివాస రాజు ఐఏఎస్ క్యాడర్ లో పని చేశారు. జాయింట్ కలెక్టర్ గా మొదలుకుని డిప్యూటీ కార్యదర్శి వరకు పని చేసిన అనుభవం ఉంది. తెలంగాణలో రేరా విస్తరణతో పాటు ప్రజలకు జవాబుదారితనంగా పని చేస్తుందని కొత్త చైర్మన్ శ్రీనివాస్ రాజు అన్నారు.

