27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్పంచ్ ఎర్రం సిలిండర్

 

నందిపేట్, బతుకమ్మ :

 

గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చెత్తను రోడ్లపై పడేయకుండా ఆటోలకు అందించాలని సర్పంచ్ ఎర్రం సిలిండర్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నందిపేట్ గ్రామపంచాయతీలో శుక్రవారం రెండు నూతన చెత్త సేకరణ ఆటోలను ఘనంగా ప్రారంభించారు.

 

Everyone must cooperate to maintain cleanliness.

 

గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో పరిశుభ్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చెత్త ఆటోలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వీటి ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం వల్ల గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని, రోజువారీ చెత్త సేకరణ మరింత సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందర్, కార్యదర్శి మహేందర్‌తో పాటు వార్డు సభ్యులు, కస్తూరి గంగాధర్,  జనగాం అన్వేష్ గౌడ్, చింత శ్రీనివాస్, షేక్ పషా, రెమ్మ రవి, పేట్ల శ్రీనివాస్, నర్మెట నరేష్, నాయకులు, ఇమ్రాన్, భాస్కర్, గంధం గంగాధర్ మదరుద్దీన్, నరసయ్య, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Everyone must cooperate to maintain cleanliness.

More articles

Latest article